మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో ఈనెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తుఫాన్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) సూచించిన 'సెన్‌యార్'గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈనెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తరకోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ, అక్కడక్కడ అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది
The IMD has issued an alert about a new cyclone forming over the Bay of Bengal, likely to be named Cyclone Senyar. Starting from November 26 to 29, heavy to very heavy rains are expected across Rayalaseema, South Coastal Andhra, and later North Coastal Andhra. The system is strengthening and may pose a significant risk to coastal regions. Watch the full weather forecast in this video.
Be the first to comment