మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా భద్రతా బలగాల నుంచి ముప్పేట నిర్బంధం, దాడులు పెరగటంతో.. ఆ పార్టీ కకావికలమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్‌కౌంటర్లలో వరుసగా అగ్రనేతల్ని కోల్పోతోంది. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, గెరిల్లా ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన హిడ్మా తాజాగా మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌తో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు. ఈ ఏడాది జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ సహా అనేకమంది కేంద్రకమిటీ సభ్యులను కోల్పోయింది. వరుసగా కేంద్ర కమిటీ సభ్యుల్ని, అగ్రనేతల్ని కోల్పోవడం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది.
The Maoist party is facing continuous setbacks as security forces intensify Operation Kagar across multiple states. With relentless combing operations, pressure tactics, and strategic encounters, the Maoist network is beginning to collapse from within.
Be the first to comment