Special Pylon to Reflect Amaravati Works : అమరావతి పునర్నిర్మాణ పనుల్ని ప్రతిబింబించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా పైలాన్ ఏర్పాటు చేస్తోంది. మే 2వ తేదీన అమరావతికి రానున్న ప్రధాని మోదీ ఈ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో పైలాన్‌ను రూపొందించారు. బహిరంగ సభ వెనక వైపున ఈ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. పైలాన్ మధ్యలో ప్రధాని మోదీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరుల పేర్లను గ్రానైట్ రాళ్లపై చెక్కారు. దాదాపు 20 అడుగుల పొడవనున్న ఈ పైలాన్ విశేషంగా ఆకట్టుకుంటోంది.అమరావతి పునర్‌నిర్మాణ పనులు పెద్దఎత్తున ప్రారంభం కానున్న వేళ రాజధానికి తరలివచ్చే వారి కోసం ప్రభుత్వం రవాణా వసతిని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు, ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రానున్నారు.
Category
🗞
News