Skip to playerSkip to main content
  • 2 weeks ago
Srilankan Tall Lady Tarjini Shivalingam Visits Tirumala : సాధారణంగా మహిళలు ఆరడుగుల ఎత్తు ఉంటేనే అందరూ ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టి చూస్తారు. అలాంటిది ఏడడుగుల ఎత్తు ఉంటే ఇకేెం అంటారో కదా! అంత ఎత్తైన మహిళను చూసి జనాలు ఎలా రియాక్టవుతారో తెలుసా? 7 అడుగుల ఎత్తు ఉన్న మహిళ నేడు తిరుమలలో ప్రత్యక్షమైంది. వానమామలై పీఠాధిపతి మధుర కవి రామనుంజ జీయర్ స్వామి, ఆయన భక్త బృందంతో పాటు ఈ ఎత్తైన మహిళ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూలైన్‌లో ఆమెను చూసిన భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ధర్శనం తర్యాత దేవస్థానం బయటకు వచ్చిన తరుణంలో అక్కడ ఉండే జనం ఆ మహిళను వింతగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఎత్తైన మహిళ శ్రీలంక నెట్ బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగంగా గుర్తించారు. స్వామివారి దర్శనం అనంతరం ఈ మహిళ తిరుమాఢ వీధుల్లో తిరగడం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆమెతో ఫొటోలు దిగడానికి ప్రయత్నించారు. ఏడడుగుల ఎత్తు ఉన్న ఈ మహిళను అందరూ తలెత్తి చూడాల్సిందే.  

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended