Skip to playerSkip to main content
  • 2 days ago
Tribals Special Thanks To Dy CM Pawan Kalyan At Alluri District: అల్లూరి జిల్లాలోని ఓ గ్రామ గిరిజనులకు 350 చెప్పుల జతలు, మరో గ్రామానికి మామిడిపండ్లు, వేరొక గ్రామ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం ప్రజల మనసును దోచుకుంటున్నారు. అందుకుగాను "థ్యాంక్యూ పవన్ కల్యాణ్ సర్" అని అల్లూరి జిల్లాలోని గిరిజనులంతా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నారు. ఏప్రిల్ నెలలో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం మీదుగా దపాడు గిరిజన గ్రామంలో పర్యటించిన పవన్ కల్యాణ్ గ్రామానికి రోడ్లు, ఇళ్లు, స్కూలు, అంగన్​వాడీ భవనం నిర్మాణాలను చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ అమలు తాలూకా అభివృద్ధి పనులన్నీ చకచకా సాగుతున్నాయి. ముందుగా చాపరాయి వాగు నుంచి పెదపాడు వరకు సుమారు రెండు కిలోమీటర్లు మేర రహదారిని నిర్మించారు. అంతేకాకుండా గ్రామమంతా సీసీ రోడ్లు నిర్మించారు. వీటితో పాటు 35 పీఎం జన్మన్ పథకంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. స్కూల్, అంగన్​నాడీ భవనాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. గ్రామ అభివృద్ధికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కు రుణపడి ఉంటామని గిరిజనులంటున్నారు. "డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనకు వచ్చినప్పుడు మా గ్రామానికి రోడ్లు, ఇళ్లు, స్కూలు, అంగన్​వాడీ భవన నిర్మాణాలను చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇచ్చిన హామీ అమలుకు సంబంధించి అభివృద్ధి పనులన్నీ వేగంగా సాగుతున్నాయి. అంతేకాకుండా గ్రామమంతా సీసీ రోడ్లు నిర్మించారు. మా ప్రాంత అభివృద్ధికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​కు ఎప్పటికీ రుణపడి ఉంటాం". -గిరిజనులు, అల్లూరి జిల్లామన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన - షెడ్యూల్ ఇదేడిప్యూటీ సీఎం పవన్ పర్యటన ఎఫెక్ట్- గిరిజన ప్రాంతాల్లో రోడ్ల కోసం నిధుల విడుదల

Category

🗞
News
Transcript
00:30Thank you very much.
01:00Thank you very much.
Be the first to comment
Add your comment

Recommended