Skip to playerSkip to main content
  • 2 days ago
Stuck Car On Railway Track Crossing : రైలు పట్టాలు దాటుతుంటే ముందు వైపు ఉన్న గేటు అకస్మాత్తుగా పడిపోతుంది. వెంటనే ట్రైన్ వచ్చి వాహనాన్ని గుద్దేస్తుంది. సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తుంటాం. కానీ పెద్దపల్లి జిల్లాలో నిజంగానే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కానీ, ఇక్కడ ట్రైన్ రాలేదు, ఎవరూ ఇలా జరగాలనీ ప్లాన్ చేయలేదు. సాంకేతిక సమస్యతో గేటు ఆటోమేటిక్​గా పడిపోయింది. ఇదే సమయంలో ఆ రూట్లో ట్రైన్ వస్తోంది. అక్కడే ఉన్న సిబ్బంది గేటును ఎత్తేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కారులో ఉన్న డ్రైవర్​ కుమార్​ ప్రాణభయంతో కాసేపు వణికిపోయాడు. ఎంతకూ తెరుచుకోకపోవడంతో, ఉపేక్షించకుండా సిబ్బంది పై అధికారులకు ఫోన్ చేసి, ఆ సమయంలో వచ్చే ట్రైన్​ను స్టేషన్​లోనే ఆపివేయించారు. సుమారు 30 నిమిషాలు కష్టపడిన తర్వాత గేటు తెరుచుకుంది. వెంటనే కుమార్ బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. టెక్నికల్ సమస్య పుణ్యమా అని 30 అరగంట పాటు ఓ ట్రైన్ ఆగిపోయింది. అటు, ఇటు రాకపోకలను కూడా నిలిపేయడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended