Cleaner Sets Private Bus on Fire: ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య ఏర్పడిన గొడవ కారణంగా బస్సు దగ్ధమైంది. ఈ ఘటన ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే: కంభం టౌన్‌లోని ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు డ్రైవర్, క్లీనర్ మధ్య గొడవ జరగడంతో దానిని మనసులో పెట్టుకున్న క్లీనర్ డ్రైవర్‌ను హతమార్చాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో పాపినేనిపల్లెలో విద్యార్థులను ఎక్కించుకునేందుకు వెళ్తున్న బస్సులో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్కూల్ బస్సు దగ్ధమైంది. అందులో ఉన్న డ్రైవర్ మంటలను గమనించి బస్సులో నుంచి బయటకు దిగాడు. అతనికి స్వల్ప గాయాలు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని నిమిషాలైతే ఆ బస్సులోకి పిల్లలు ఎక్కేవారు. కానీ ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
Be the first to comment