Yuva Story on Young Entrepreneurs From Vijayawada: క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో వేగవంతమైన గ్లోబల్ డిమాండ్‌తో యువ పారిశ్రామికవేత్తల నూతన స్టార్టప్‌ల ద్వారా యువతకు ఆకర్షణీయ ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం పుస్తకాల్లోనే కనిపించిన ఈ సాంకేతికత, ఇప్పుడు కలల పరిశ్రమగా మారింది. వేలాది యువకులకు శిక్షణ, ఉద్యోగాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మార్కెట్ అవసరాలు, రీసెర్చ్ హబ్‌ల పెరుగుదలతో యువతకు ఉపాధి అవకాశాలు సమృద్ధిగా వస్తాయంటోన్న యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్ ఆరిమిల్లి, పృథ్వీల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలో నూతన సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుందని యువ పారిశ్రామికవేత్త నిఖిల్, పృథ్వీ అన్నారు. సాధారణ కంప్యూటర్స్‌లో అయితే కొన్ని కార్యకలాపాలు మాత్రమే చేయగలుగుతాయని అయితే ఈ క్వాంటమ్‌లో సాఫ్ట్వేర్ ద్వారా పనులను త్వరితగతిన పూర్తి చేయొచ్చని ఆయన స్పష్టం చేశారు. మేము అభివృద్ధి చేసిన క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా యువతకు శిక్షణను ఇస్తామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా వారి శిక్షణా కాలం ముగిసిన తర్వాత సర్టిఫికెట్లను అందించి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని యువ పారిశ్రామికవేత్తలు నిఖిల్, పృథ్వీ వెల్లడించారు.
Be the first to comment