PABR Right Canal Leakage in Anantapur District: అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని పీఏబీఆర్ కుడి కాలువకు భారీ గండి పడింది. దీంతో కుడి కాలువ తెగి నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరిమడులు, వేరుశనగ పంట పొలాల్లోకి నీరు చేరుతోంది. నీరు భారీ ప్రవాహంతో రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ విషయాన్ని స్థానిక రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గేట్లు మూసేందుకు యత్నించగా ఆ ప్రయత్నం ఫలించలేదు. దాంతో అక్కడ నుంచి అధికారులు వెనుదిరిగారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఊహించని ఈ ఘటనతో తమ పొలాలు పాడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏబీఆర్ కుడి కాలువ గేట్లు మూసివేసి పంట పొలాలను కాపాడాలని అధికారులను రైతులు కోరుతున్నారు. ఇప్పటికే మొంథా తుపాను ప్రభావంతో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరగా అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకొంటున్నారు.
Be the first to comment