Skip to playerSkip to main content
  • 6 weeks ago
Srisailam Reservoir and Ghat Road Covered With Heavy Snow: శ్రీశైలంను మంచు కప్పేసింది. శ్రీశైలం జలాశయం పొగ మంచులో చూపరులను ఆకట్టుకుంది. ఉదయం పది గంటలైనా మంచు వీడలేదు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి భయపెడుతుంటే, మరోవైపు కనువిందు చేసే ప్రకృతి అందాలు పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాయి. ఇటువంటి అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉదయం వేళ ఈ మంచు అందాలు ప్రకృతి ప్రేమికులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి. శ్రీశైలం జలాశయంతో పాటు పొగమంచు ఘాట్​ రోడ్డు అంతటా వ్యాపించి ఆహ్లాదాన్ని వాతావరణం సంతరించుకుంది. దీంతో నల్లమల అటవీ ప్రాంతంతో సహా ఘాట్ రోడ్డు పూర్తిగా మంచుతో నిండిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు లైట్ల వెలుతురులో జాగ్రత్తగా తమ రాకపోకలను సాగించారు. ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలితీవ్రత బాగా పెరగడంతో కొద్దిమంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended