APSRTC Prepares to Run Extra Buses: ఇండిగో విమానాల ఆకస్మిక రద్దు నిర్ణయం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. విమాన ప్రయాణం రద్దు కావడంతో, ప్రత్యామ్నాయ మార్గాల కోసం జనం వెతుకుతున్నారు. ఈ పరిణామం ఏపీఎస్ఆర్టీసీకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. విమానాల రద్దు ప్రభావం నేరుగా ఆర్టీసీపై పడుతుందని అధికారులు గట్టిగా భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ముఖ్యంగా సుదూర ప్రాంతాలైన హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా రూట్లలో రోజువారీ సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయి. అయితే, రద్దీ ఒక్కసారిగా పెరిగితే పరిస్థితి ఏంటి? దీనికి కూడా అధికారుల దగ్గర పక్కా ప్లాన్ ఉంది. ప్రయాణికుల రద్దీని బట్టి తక్షణమే అదనపు సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి బస్టాండ్లలో రద్దీ సాధారణ స్థాయిలోనే ఉంది. అయినా, అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రయాణికులకు టికెట్లు దొరకని పరిస్థితి రాకూడదని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఆర్టీసీ అధికారుల మాటల్లో తెలుసుకుందాం.
Be the first to comment