CM Practices Football to Beat Messi : ఫుట్‌బాల్ స్టార్ లియోనాల్ మెస్సీతో పోటీపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కి రానున్న మెస్సీ, సీఎంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ నెల 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీమ్‌తో సీఎం టీమ్‌కి ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీ గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను తెలంగాణ సీఎంవో సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసింది. దిగ్గజ ఆటగాడిని ఢీకొట్టేందుకు ఇప్పటి నుంచే సీఎం తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు. మెస్సీని స్వాగతించటానికి, కలవటానికి ఎదురుచూస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎక్స్‌లో రాసుకొచ్చారు. అర్జెంటీనా ఆటగాడు మెస్సీ భాగ్యనగరానికి విచ్చేయటం అభిమానులకు ఉత్తేజకరమైన క్షణాలని అభివర్ణించారు. తాజాగా ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. 'తెలంగాణ రైజింగ్ - 2047 విజన్‌తో ఫుట్‌బాల్ క్రీడా వేదిక ఆధారంగా క్రీడాకారుడు మెస్సీ సహాయంతో ప్రపంచానికి మరింత పరిచయం చేయాలనే లక్ష్యంతో మైదానంలోకి స్వయంగా దిగాను' అని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Be the first to comment