Snake Catcher Rescues Cobra that Fell into Well in Konaseema District : పాడుబడ్డ బావిలో నాగుపాము హల్చల్ చేసింది. వర్షాకాలం మొదలు కావడంతో ఇంతకాలం బొరియలు, పుట్టలు, పొదలలో ఉన్న పాములు జనవాసాలు, పంటచేల్లోకి వస్తున్నాయి. బావిలో కప్పలను వేటాడుతున్న నాగుపామును ఇంటి యజమాని గమనించి స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటన కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో చోటు చేసుకుంది.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం టి. కొత్తపల్లి గ్రామంలో తెల్లవారుజామున బ్రాహ్మణుల ఇంటి ఆవరణలో ఉన్న పాడుబడ్డ బావి వద్ద కప్పలను వేటాడుతూ నాగుపాము నూతిలో పడింది. ఇది గమనించిన ఇంటి యజమాని స్నేక్ క్యాచర్ వర్మకి సమాచారం ఇచ్చాడు. స్థానికుల సహాయంతో స్నేక్ క్యాచర్ పాముని సురక్షితంగా బయటికి తీశాడు. బుసలు కొడుతున్న పామును ఓ ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. అనంతరం జన సంచారం లేని ప్రదేశంలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.విభిన్న చారలు, పాక్షిక కనురెప్పలు - శేషాచలం అడవుల్లో పాము పోలికలతో కొత్త జీవిప్రపంచంలోనే డేంజరస్ అనకొండలు భారత్‌లో- క్షణాల్లోనే మనిషిని చంపేస్తాయట- ఎక్కడున్నాయో తెలుసా?