Skip to playerSkip to main content
  • 1 week ago
Forest Officer Catch Huge Python : సాధారణంగా మన గ్రామాల్లో ఆరు లేదా పది అడుగుల పాములను చూసి హడలిపోతుంటాం. అయితే ఉత్తరాఖండ్​, నైనిటాల్​ జిల్లాలోని హెంపుర్​ డిపో ప్రాంతంలో 18 అడుగుల పొడవు, 175 కిలోల బరువున్న భారీ కొండచిలువ కనిపించింది. దాన్ని చూసి ఆ గ్రామస్థులంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో స్థానికులు వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు స్నేక్ క్యాచర్ తాలిబ్ హుస్సెన్​ అనే వ్యక్తిని పిలిపించారు. తాలిబ్​ చాలా చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. తరువాత అతను దానిని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. కాగా, ఈ తరహా పాములు కనిపించడం చాలా అరుదని తాలిబ్ తెలిపారు. అయితే ఇవి మనుషులకు ఎటువంటి హాని చేయవని అటవీశాఖ అధికారులు చెప్పారు. ఏదైనా వన్యప్రాణి కనిపిస్తే దానికి హాని చేయకూడదని, వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్థులకు అటవీశాఖ అధికారులు పిలుపునిచ్చారు.

Category

🗞
News
Transcript
00:00Transcribed by ESO, translated by —
00:30Transcription by CastingWords
01:00Transcription by CastingWords
Be the first to comment
Add your comment

Recommended