Epuri Somanna's amazing song at Aatmiyulu Maata Muchata ఆత్మీయులు..మాట ముచ్చట సమావేశం లో కెసిఆర్ ని విమర్శిస్తూ ఏపూరి సోమన్న పాట పాడారు.. టి.టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి టిడిపికి చెందిన పార్టీ కార్యకర్తలు...చేజారిపోకుండా వ్యూహాలు రచిస్తున్నారు. వారితో వరుస భేటీలు జరుపుతున్నారు. శనివారం ఉదయం కొడంగల్ లో పలు భేటీలు జరిపిన ఆయన సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. నగరంలో మరోసారి తనకు మద్దతిస్తున్న వారితో చర్చలు జరపాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఆత్మయులు..మాట ముచ్చట' పేరిట కార్యక్రమాన్ని ప్రారంబించారు. అయితే కీలకమైన వారిని మాత్రమే రేవంత్ పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం రేవంత్ సాయంత్రానికి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లతో భేటీ కానున్నారని ప్రచారం జరుగుతోంది. కార్యక్రమాన్ని మొదలుపెట్టే క్రమంలో ఏపూరి సోమన్న పాట పాడి కార్యక్రమాన్ని ప్రారంబించారు. తరువాత రేవంత్ రెడ్డి స్పీచ్ ప్రారంబించారు.
Be the first to comment