మొంథా తుపాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేటలో పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో స్థానికులు అవస్థలు పడ్డారు. చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, భావనా రుషినగర్, రూత్ డైకెమేన్ నగర్ ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్ల చుట్టూ వరదనీరు ఉండటంతో బయటకు రాలేక ఆయా ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పసుమర్తి వద్ద ఉన్న సబ్ స్టేషన్ జలమయం... సబ్ స్టేషన్ లోకి కంట్రోల్ రూమ్ లోకి చేరిన వర్షపు నీరు చేరగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీరు తెలిగిస్తే తప్ప విద్యుత్ పునరద్దరించలేని పరిస్థితి నెలకొంది. చిలకలూరిపేట జాతీయ రహదారి ఎడ్లపాడు సమీపంలోని తిమ్మాపురం బైపాస్ ఫ్లైఓవర్ కింద వర్షం నీరు భారీగా ప్రవహిస్తుంది... చిలకలూరిపేట నుండి ఫ్లైఓవర్ కిందగా జాతీయ రహదారి ఎక్కాలి అంటే నానా అవస్థలు పడుతున్నారు వాహనదారులు. చిలకలూరిపేటలో పంట పొలాలు పూర్తిగా నీటముగిగాయి. వందల ఎకరాల్లో పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. మరో రెండు రోజులు వర్షాలు పడనున్న నేపథ్యంలో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Cyclone Montha Hits Palnadu District!
Heavy rains lash Narasaraopet, Sattenapalli, and Chilakaluripet.
తొలగని ముప్పు, ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు- అతి భారీ వర్షాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-rainfall-is-likely-over-ap-and-telangana-in-next-few-hours-as-imd-latest-alerts-458001.html?ref=DMDesc
Cyclone Montha: ఇవాళ, రేపు పలు ప్రధాన రైళ్లు రద్దు - జాబితా ఇదే..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-cancels-many-trains-for-two-days-due-to-cyclone-in-telugu-states-list-here-457989.html?ref=DMDesc
ఏపీలో ఈ జిల్లాల్లో పాఠశాలలకు, కాలేజీలకు సెలవులు పొడిగింపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-extends-holidays-for-all-educational-institutes-up-to-31st-of-this-month-457987.html?ref=DMDesc
Be the first to comment