Republic Day Celebrations At Ramoji Film City 2026 : ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విజయేశ్వరి రామోజీ ఫిల్మ్‌సిటీ భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రామోజీరావు మనవడు సీహెచ్. పూర్ణ సుజయ్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఆర్ఎఫ్సీ, ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, డాల్ఫిన్ హోటల్స్‌కు చెందిన వివిధ విభాగాధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్‌మైదానంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
Comments