Skip to playerSkip to main content
  • 6 hours ago
Bear Hulchul in Rayadurg Town at Anantapur District: అనంతపురం జిల్లాలో ఓ ఎలుగుబంటి పట్టపగలే హల్​చల్​ చేసింది. ఎలుగుబంటి సంచారంతో ప్రజలు భయాందోళన చెందారు. రాయదుర్గం పట్టణంలోని ముత్రాస్ కాలనీ సమీపంలో ఉన్న బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం పట్టపగలే ఎలుగుబంటి సంచరించింది. ఈ ఘటనతో అక్కడ వ్యవసాయ పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు, వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు. రాయదుర్గం పట్టణం చుట్టూ కొండలు, గుట్టలు, వ్యవసాయ పండ్ల తోటలు అధికంగా ఉండడంతో అడవి జంతువులు, ఎలుగుబంట్లు, చిరుత పులులు జనావాసాల్లోకి వస్తుంటాయి. ఎలుగుబంట్లు ఆహారము, తాగునీటి కోసం పట్టణ సమీపంలోని కొండల్లో నుంచి కిందికి వస్తుంటాయని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వాటి బారి నుంచి తమను రక్షించాలని అటవీ శాఖ అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు. సమీపంలో ఉన్న రైతులు మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.  

Category

🗞
News
Transcript
00:00Transcribed by ESO, translated by —
00:30Transcribed by —
01:00Transcribed by —
Be the first to comment
Add your comment

Recommended