CM Chandrababu Naidu Family At Naravaripalle : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నారావారిపల్లె గ్రామ దేవత, నాగాలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధుల వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, ఆయన కుమారుడు దేవాంశ్, నటుడు నారా రోహిత్ దంపతులు, తదితరులు పాల్గొన్నారు. నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.గ్రామాభివృద్ధిపై సీఎం దృష్టి : ఒకవైపు సంబరాలు చేసుకుంటూనే గ్రామాభివృద్ధిపై సీఎం దృష్టి సారించారు. ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.30-40 వేల ఆదాయం వచ్చేలా 'వర్క్ ఫ్రమ్ హోమ్' సెంటర్లు, సాగునీటి సరఫరా మెరుగుదల, పర్యాటక రంగ అభివృద్ధి వంటి కీలక ప్రణాళికలను అధికారులకు వివరించారు. ఈ అభివృద్ధి పనులతో నారావారిపల్లె గ్రామానికి కొత్త కళ తీసుకురావాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Be the first to comment