ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ పైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఇప్పటికే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ను ఆరు వరుసలుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఇక తాజాగా మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసలుగా విస్తరించడం కోసం సన్నాహాలు జరుగుతున్న క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ పై ప్రభుత్వం సమీక్ష చేస్తుంది. జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఇటీవల జరిగిన సమావేశంలో కన్సల్టెన్సీ తయారుచేసిన డీపీఆర్ పై కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేసిన అభ్యంతరాలపైన జాతీయ వివరణ కోరిన ఆయన ప్రజా ప్రతినిధులు, కలెక్టర్ల సూచనలను పరిశీలించి డిపిఆర్ లో చేర్చాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న డిపిఆర్ డిజైన్ పైన ముఖ్యంగా బెంజ్ సర్కిల్, చిన్న ఓగిరాల మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి వాహన అండర్పాస్ లు లేకపోవడాన్ని ప్రస్తావించి, మార్పులు చేయాలని సూచించారు.
The AP Government is taking key steps to upgrade national highways, with plans to expand both Hyderabad–Vijayawada and Machilipatnam–Vijayawada highways into six-lane expressways.
In a high-level review, the government examined the DPR (Detailed Project Report) and directed officials to include suggestions from collectors and public representatives. Special focus has been placed on the Benz Circle–Chinna Ogirala stretch to reduce traffic congestion through vehicle underpasses and better design improvements.
Watch this video for full details on the project updates, DPR review, and the government’s future infrastructure plans!
👉 Subscribe for regular AP Government and Infrastructure updates.
Be the first to comment