వాతావరణ శాఖ మరో తుఫాను పైన అప్రమత్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వాతా వరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. చలి గాలుల తీవ్రత పెరిగింది. బంగాళాఖాతంలో ఈశాన్య రుతుపవనా లు బలపడేందుకు అనువుగా పరిస్థితులు మారనున్నాయి. ఈ నెల 19 లేదా 20వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. అనంతరం ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనావేశారు. దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని విశ్లేషించారు.
Another Cyclone Alert! The Indian Meteorological Department has warned of a new system forming over the Bay of Bengal around November 19–20. As per ISRO weather experts, this low-pressure area may strengthen into a cyclone, likely moving toward North Tamil Nadu and South Coastal Andhra Pradesh. Cold winds are already intensifying across the Telugu states, signaling major weather changes ahead.
Be the first to comment