Tamil and Malayalam speaking populations are falling across most states in north India even as Tamil Nadu and Kerala are seeing a huge jump in the number of Hindi, Bengali, Assamese and Odia speakers. #hindi #bengali #odisha #southindia #northindia
దక్షిణాదిన హిందీ, బెంగాళీ, ఒడిశా భాషలు మాట్లాడే వారు క్రమంగా పెరుగుతున్నారు. ఓ వైపు ఉత్తరాదిన తమిళం, మలయాళం మాట్లాడే జనాభా తగ్గుతుంటే, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో హిందీ, బెంగాలీ, అస్సామీ, ఒరియా తదితర భాషలు మాట్లాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011 జనాభా మాతృభాషా గణాంకాలు వెల్లడయ్యాయి. గతంలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఉత్తరాదికి ఎక్కువగా వలసలు వెళ్లేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడు ఉత్తరాది వారు దక్షిణాదికి బాట పడుతున్నారు. ఒకప్పుడు దక్షిణాది వారికి గమ్యస్థానంగా ఉన్న ముంబైలో ఇప్పుడు కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడేవారు తగ్గారు. ఉత్తరాదిన 2001 నుంచి 2011 వరకు మలయాళీయుల సంఖ్య పెరుగుదల ఉన్నది మాత్రం ఉత్తర ప్రదేశ్‌లో. నోయిడా కేంద్రంగా ఐటీ కంపెనీ ఉండటంతో ఈ పరిస్థితి.
Be the first to comment