Skip to playerSkip to main content
  • 7 years ago
Afghanistan's historic series win, renowned commentator Harsha Bhogle took to Twitter and applauded Rashid Khan's brilliance.

అఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేసి బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ విజయంపై ఎటూ తేలని నిర్ణయాన్ని రనౌట్ చేసి అఫ్ఘనిస్థాన్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు. దీంతో తమ జట్టుకు చారిత్రాత్మక విజయం అందడంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా జట్టును, రషీద్ ఖాన్‌ను అభినందిస్తూ సీనియర్ కామెంటేటర్ హర్ష భోగ్లే శుభాకాంక్షలతో ట్వీట్ చేశాడు.
అతని ట్వీట్‌లో 'కేవలం ఆఖరి ఓవర్‌కు 9 పరుగులు చేస్తే గెలుస్తుందనుకున్న సమయంలో రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేశావు. తద్వారా బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ అయ్యేందుకు జట్టుకు సహాయపడ్డావు. అఫ్ఘనిస్థాన్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది రషీద్ ఆటతీరు మెరుగవుతుందనడానికి నిదర్శనం' అని పేర్కొన్నాడు.
దానికి స్పందించిన రషీద్ ఖాన్ 'ధన్యవాదాలు. సోదరా' అనే అర్థం వచ్చేలా 'థ్యాంక్యూ బ్రో' అంటూ ట్వీట్ చేశాడు. రషీద్ అలా ట్వీట్ చేయడం.. నెటిజన్లకు నచ్చలేదు. సోదరుడా.. నీకు సర్‍‌లాంటివాడు, బ్రో ఏంటి? అతని వయస్సు 50కి పైనే, నువ్వు 20 కూడా లేవు. ఇంకొక విషయం ఏమిటంటే అతని క్రికెట్‌లో ఓ లెజెండ్ కామెంటేటర్. మళ్లీ ఈ సారి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. నీ వయసెక్కువ అనడానికి ఇదే సాక్ష్యం. సోదరుడు కాదు. అతను నీ తండ్రి వయస్కుడు. నీకు కేవలం 19 ఏళ్లే. అతనికి 56 ఏళ్లు. అంటూ ట్వీట్లతోనే రషీద్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended