Made-in-Andhra Pradesh drone launched by Chief Minister Chandrababu Naidu on friday. These devices, branded as ‘Amaravati drones,’ have somany specialities..
అమరావతి డ్రోన్...మేడిన్ ఆంధ్రా డ్రోన్...అచ్చ తెలుగులో చెప్పాలంటే అచ్చమైన ఆంధ్రా తయారీ డ్రోన్...మేడిన్ చైనా వస్తువులు మన దేశంలో ఎంత పాపులర్ అయ్యాయో అలాగే డ్రోన్ల రంగంలో మనదైన స్పెషాలిటీని చాటేందుకు అందరి ముందుకు వచ్చేసింది. అమరావతి...నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని...అయితే ఇప్పుడు ఇదే పేరు ఒక ప్రత్యేక వస్తువు తయారీకి సంబంధించి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఓ బ్రాండ్ కూడా కానుందా?...అంటే అవుననే అంటోంది ఎపి ఇన్నోవేషన్ అకాడెమి...అదెలాగంటే?... ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఏర్పాటైన అమరావతి డ్రోన్ల మాన్యుఫాక్చరింగ్ కంపెనీ తమ తొలి ప్రొడక్ట్ ను తయారుచేశాయి. అలా తయారైన మొట్టమొదటి మేడ్ ఇన్ ఆంధ్రా డ్రోన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆవిష్కరించారు. టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం...నూతన ఆలోచన,ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ‘ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ'ని విశాఖపట్నం సన్‌రైజ్ స్టార్టప్ విలేజ్‌లో ఏర్పాటుచేసింది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారితో స్టార్టప్ లను ప్రారంభించంలో కీలక పాత్ర పోషిస్తున్నఏపీ ఇన్నోవేషన్ సొసైటీ...ఈ మధ్యకాలంలో అత్యంత పాపులర్ అయిన డ్రోన్ల తయారీ మీదా దృష్టిసారించింది. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రోబోటిక్ టెక్నాలజీ సంస్థ ‘ఓమ్నీ ప్రెజెంట్'తో కలిసి విశాఖపట్నంలో నాలుగు నెలల క్రితం ‘అమరావతి డ్రోన్స్' పేరుతో రిసెర్చ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ లేబొరేటరీని ఏర్పాటుచేసింది.
Be the first to comment