Skip to playerSkip to main contentSkip to footer
  • 1/18/2018
RK Nagar MLA TTV Dhinakaran has distanced himself from a claim made by his uncle Dhivakaran, that former chief minister Jayalalithaa is no more on December 4, 2016 and not on December 5 as officially announced by Apollo Hospitals.

జయలలిత మృతి విషయంలో శశికళ సోదరుడు దివాకరన్ చేసిన వ్యాఖ్యలు వారి ఫ్యామిలీలో చిచ్చు రేపాయి. జయలలిత మృతి గురించి దివాకరన్ కు ఏం తెలుసు ? అని మాట్లాడుతున్నారు, ఆయన దగ్గర ఏమైనా సాక్షాలు ఉన్నాయా ? అని ప్రశ్నిస్తున్నారు. అయితే టీటీవీ దినకరన్ మాత్రం తెలివిగా తప్పించుకుంటున్నారు.
ఇదే విషయాన్నీ శశికళ మేనకోడలు క్రిష్ణప్రియ ప్రశ్నిస్తున్నారు. గత డిసెంబర్ నెలలో జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో విడుదల చేసి రాద్దాంతం చేశారని క్రిష్ణప్రియ మండిపడుతున్నారు.
జయలలిత మృతిపై నిజాలను ఎవ్వరూ దాచిపెట్టడం లేదని, అమ్మ విషయంలో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, అనవసరంగా జయలలిత విషయంలో లేనిపోని వ్యాఖ్యలు చేసి ఆమె అభిమానులను అయోమయానికి గురి చెయ్యరాదని క్రిష్ణప్రియ మనవి చేశారు.
శశికళ సోదరుడు దివాకరన్ జయలలిత మృతి తేదీ మార్పుపై చేసిన వ్యాఖ్యలపై ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ను మీడియా ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలీదని చెప్పారు. తెలియని విషయాల గురించి మాట్లాడటం మంచిదికాదని టీటీవీ దినకరన్ తెలివిగా తప్పించుకున్నారు.
2016 డిసెంబర్ 4వ తేదీ తాను అపోలో ఆసుపత్రిలో జయలలితను చూశానని, ఆ సమయంలో అమ్మకు ఈసీఎంఓ ను అమర్చారని టీటీవీ దినకరన్ మీడియాకు చెప్పారు.
శశికళ సోదరుడు దివాకరన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే, టీటీవీ దినకరన్ ప్రధాన అనుచరుడు తంగ తమిళ సెల్వన్ మండిపడ్డారు. జయలలిత విషయంలో ఇలాంటి లేనిపోని వ్యాఖ్యలు చెయ్యడం మంచిదికాదని తంగ తమిళ సెల్వన్ హెచ్చరించారు.

Category

🗞
News

Recommended