Skip to playerSkip to main content
  • 8 years ago
A massive fire broke out in four coaches of Patna-Mokama passenger express in wee hours of Wednesday. The train was stationed at the Mokama railway station when the fire erupted.

పాట్నా ప్యాసింజర్‌కు అగ్ని ప్రమాదం
బీహార్‌ రాష్ట్రంలోని మొకామా రైల్వేస్టేషన్‌ యార్డ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా పాట్నా-మొకామా ప్యాసింజర్‌ రైలు మంటల్లో కాలిపోయింది. ఐదు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో జరిగింది. ముందుగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి. ఆర్పేందుకు ప్రయత్నిస్తుండగానే మంటలు మరో రెండు మూడు బోగీలకు వ్యాపించాయి.
అగ్నిమాపక సిబ్బంది అయిదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద కారణాలపై రైల్వే భద్రతా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended