Vintage Cars And Bikes Exhibition In Hyderabad : గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని అబిడ్స్ చిరాగ్‌అలీ వీధిలో వింటేజ్ వాహనాల ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 కార్లు, 60 ద్విచక్ర వాహనాలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను చూసేందుకు వింటేజ్ వాహనాల ప్రేమికులు ప్రత్యేక ఆసక్తిని కనబరిచారు. అరుదైన మోడల్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రదర్శనలో ఉన్న అన్ని వింటేజ్ వాహనాలను ఒకే చోట చూసిన వారి ఆనందానికి అవధులు లేవు. 1965లో ఈ జావా ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన చర్మాస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెప్టెన్ కేఎఫ్ పిస్టోన్‌జీ (80) కూడా ఆయన బండితో హాజరయ్యారు. ప్రదర్శనకు వచ్చిన వారంతా తనతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. అక్కడ ఉన్నవన్నీ కొన్ని సంవత్సరాల నాటి అరుదైన మోడల్స్ కావడంతో, అందరూ వాటిని ఎంతో తీక్షణంగా చూస్తూ ఉండిపోయారు. అలాగే 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించిన బండి ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది.
Comments