Surgery to Injured Snake in Visakhapatnam: పాములను ప్రత్యక్షంగా చూస్తే ఎవరికైనా సరే గుండెల్లో దడ పుట్టాల్సిందే. కొంచెం దూరంలో కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ విశాఖలో గాయపడిన నాగుపాముని ప్రభుత్వ వైద్యుడు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అంతకుముందు గాయాలతో ఉన్న ఆ పాముని స్నేక్ క్యాచర్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించి దాని ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే విశాఖలో సింధియా పరిధిలో ఉన్న నేవల్ క్యాంటీన్‌లో సంచరిస్తున్న నాగుపామును స్నేక్ క్యాచర్ నాగరాజు పట్టుకున్నారు. పాము పడగపై ఉన్న గాయాలను గుర్తించి చికిత్స కోసం షిప్‌యార్డ్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పశు వైద్యాధికారి సీహెచ్ సునీల్ కుమార్ ఆ నాగపాముకి శస్త్రచికిత్స చేశారు. పాము పడగపై ఉన్న గాయానికి 8 కుట్లు వేశారు. పామును 4 రోజులు పర్యవేక్షించి తర్వాత అడవిలో విడిచి పెట్టాలని వైద్యులు సూచించినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు.
Be the first to comment