Mini Truck Falls into Kundu River of Kadapa District : వైఎస్సార్ కడప జిల్లా పెద్దముడియం వద్ద మినీ ట్రక్ అదుపుతప్పి కుందూ నదిలో పడిపోయిన ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మైలవరం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన హనుమంతరెడ్డి తన వాహనానికి మరమ్మతులు చేయించేందుకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు బయలుదేరాడు.పెద్దముడియం - పాలూరు మధ్య ఉన్న కుందూ నదిని దాటే క్రమంలో వాహనం అదుపుతప్పి నదిలోకి పడిపోయింది. వంతెనకు ఇరువైపులా రక్షణ గోడ లేకపోవడంతో మినీ ట్రక్కు (Mini Truck) తో పాటు వాహన యజమాని నీటిలో పడిపోయాడు. నదిలో కొట్టుకుపోతున్న వాహనాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పెద్ద తాళ్లను నీటిలో విసిరి హనుమంతరెడ్డిని కాపాడారు. ఆ తర్వాత జేసీబీ సాయంతో మినీ ట్రక్కును పైకి లాగారు. ఆర్అండ్బీ శాఖ అధికారులు స్పందించి వంతెనపై రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
Be the first to comment