Skip to playerSkip to main content
  • 2 months ago
People Struggles Due To Montha Effect in Bapatla District: మొంథా తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా పర్చూరులో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగు సమీపంలో ఉన్న ఓ ప్రార్ధనా మందిరాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఈ క్రమంలో ప్రార్థన మందిరంలో 15 మంది చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని ఇసుక బస్తాలు, తాళ్ల సహాయంతో కాపాడి సురక్షితంగా వారిని బయటకు తీసుకువచ్చారు. దాంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.  పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మెట్ట ప్రాంతాల నుంచి వచ్చే నల్లమడ వాగు పర్చూరు, పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, బాపట్ల మండలాల్లో పంట పొలాలను ముంచెత్తుతోంది. దాదాపు లక్ష ఎకరాలకు పైగా ముంపు బారిన పడుతుండటంతో రూ.వందల కోట్ల విలువైన పంటలు నీటి పాలవుతున్నాయి. అప్పటి నుంచి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టలేదు. సీవాల్యూ 350 నుంచి 500కు పెంచాలన్న ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చొరవ చూపడంతో ప్రస్తుతం భూసేకరణ దశలో ఉంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Wow.
01:00Thank you so much for joining us today, and we'll see you in the next video.
Be the first to comment
Add your comment

Recommended