Congress Cadres Celebrations at Gandhi Bhavan : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ విజయఢంకా మోగించింది. ఈ సందర్భంగా గాంధీభవన్లో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి సంతోషంతో మిఠాయిలు తినిపించుకున్నారు. మంత్రులు, ముఖ్య నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ సినీయర్ నాయకుడు వి.హనుమంతరావు హుషారుగా నేతలందరితో కలిసి స్టెప్పులేశారు. దీంతో గాంధీభవన్ పరిసరాలు సందడిగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి పోస్టర్లు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతరావు, మత్స్య సహకార కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 98,988 ఓట్లు ఆయన సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో బుల్లెట్లా దూసుకుపోయారు. విజయానంతరం నవీన్ యాదవ్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి యూసుఫ్ గూడా నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఇందులో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ సందడి చేశారు.
Be the first to comment