Skip to playerSkip to main content
  • 2 days ago
Dornala-Srisailam Ghat Road Traffic Block Due to Heavy Rains : మొంథా తుపాను ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి పలు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ వర్షాలు కురవటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుపాన్​ ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మరోవైపు హైదరాబాబ్​ - శ్రీశైలం రోడ్డులో కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ క్రమంలో దోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డులో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెద్ద దోర్నాల అటవీశాఖ చెక్ పోస్ట్ పద్ద పోలీసులు వాహనాలను నిలిపి వేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎడతెరపి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వానలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పోలీసులు శ్రీశైలం వెళ్లే వాహనాలను ఆపేశారు. శ్రీశైలం ఘాట్​ రోడ్డు క్లియర్ అయ్యాక వాహనాలు రాకపోకలు పునరుద్దరిస్తామని తెలిపారు. ఏ విధమైన ప్రమాదం జరగలేదని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. 

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended