Skip to playerSkip to main content
  • 2 days ago
Snow Effect in Paderu At Alluri District: అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ భిన్న వాతావరణాలకు నిలయంగా ఉంది. ఏ కాలం చూసినా ఏదో ప్రకృతి రమణీయ దృశ్యాలు కనిపిస్తూనే ఉంటాయి.  ఈ భిన్న వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో పాడేరు ఘాట్​రోడ్డులో మధ్యాహ్నం పొగ మంచు దట్టంగా కమ్మేసింది. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తర్వాత రహదారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. మరో వైపు ఉషోదయ వేళలో కనిపించే పొగ మంచు మధ్యాహ్నం కనబడటంతో వాహనదారుల్లో ఆసక్తి నెలకొంది. మలుపులు వద్ద వాహనాలు ప్రమాదకరంగా ప్రయాణించాయి. మరో పక్క కొండదారులు శ్వేత మయంగా మారి మరో లోకంలో విహరించినట్లు ప్రకృతి ప్రేమికులు పరవశమయ్యారు. పాడేరు అమ్మవారీ పాదాలు గుడి నుంచి 12 మైళ్ల జంక్షన్ మార్గం వరకు రహదారి మొత్తం పొగమంచు కమ్మేసింది. పర్యటనకు వచ్చిన వారు మంచు దుప్పటి వాతావరణంతో కొత్త అనుభూతిని పొందారు.    

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended