Skip to playerSkip to main contentSkip to footer
  • 3 days ago
Villagers Looted Oil Viral Video : ఉత్తర్​ప్రదేశ్​లో నూనె ట్యాంకర్​ బోల్తా పడగా, స్థానికులు ఆయిల్​ తీసుకోవడానికి డబ్బాలు, బకెట్లతో ఘటానాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామస్థులను తరిమికొట్టారు. ఘటనలో గాయపడిన డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, అమేఠీ జిల్లాలోని కామరౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వారణాసి- లఖ్​నవూ హైవేపై మంగళవారం ఉదయం ఘటన జరిగింది. సుల్తాన్​పుర్​ నుంచి లఖ్​నవూకు నూనెను తీసుకెళ్తున్న ట్యాంకర్​ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్​లో ఉన్న నూనె కోసం గ్రామస్థులు ఎగబడ్డారు. అయితే ట్యాంకర్​ బోల్తా పడిన వెంటనే డ్రైవర్​ను కాపాడడానికి ఎవరు సహాయం చేయకపోయినా, పడిపోయిన ఆయిల్​ను తీసుకెళ్లాడానికి ఘటనా స్థలానికి చేరుకున్నారట. ట్యాంకర్​ బోల్తా పడిన సమీపంలో బురదమయమైన రహదారిపై గ్రామస్థులు వారి డబ్బాలల్లో పడిపోయిన నూనెను నింపుతున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతోంది. గాయపడిన ట్యాంకర్​ డ్రైవర్ బహదూర్​పుర్​ హైదర్​గఢ్​ ప్రాంతానికి చెందిన రామ్​ మిలన్​ కుమారుడు రామ్​రాజ్​గా పోలీసులు గుర్తించారు.

Category

🗞
News
Transcript
00:00To be continued...
00:30Transcription by CastingWords
01:00Transcription by CastingWords

Recommended