Beauty of Duduma Waterfalls in AP-Odisha Border: ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని ఒడిశా రాష్ట్రంలో ప్రకృతి అందాలను నెలవైన డుడుమ జలపాతపు ప్రాంతం ప్రత్యేకమైన అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డుడుమ జలపాతం వర్షాకాలంలో అదనపు అందాలతో సందర్శకులకు మంత్రముగ్ధులను చేస్తోంది. దాదాపు 556 అడుగుల ఎత్తు నుంచి ఏడాది పొడుగునా జాలువారే జలపాతం నీటి ప్రవాహం, మరో వైపు చుట్టూ పచ్చని కొండల నడుమ జలపాతం అందాలు మరుపురాని జ్ఞాపకాలను సందర్శకులకు ఇస్తోంది. ఈ అందాలతో కలగలిసి విహంగ వీక్షణం మరింత ఆహ్లాదకరం కావడం విశేషం. ఒకవైపు ఆంధ్ర మరోవైపు ఒడిశా వీటి రెండిట నడుమ డుడుమ జలపాతం ఉంది. ఈ జలపాతానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. బోండా గిరిజన ప్రజలను చూడటానికి వచ్చే విదేశీ పర్యాటకులు సైతం డుడుమ జలపాతం దగ్గరకు వచ్చి కాసేపు సేద తీరుతారు. ఈ జలపాతపు వరద ఉద్ధృతి కారణంగా జాలువారే అందాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది.Video: ప్రకృతి సోయగం.. డుడుమా జలపాతంపొంగి పొర్లుతున్న డుడుమ జలపాతం
Be the first to comment