Andhra Boy Married German Girl in Nellore: ఈ ఇద్దరిదీ ఊరు కాని ఊరు. దేశం కాని దేశం. ఒకరి భాష మరొకరికి రాదు. అయినా వారి హృదయాలు కలిశాయి. ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించిన ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యారు. తాజాగా నెల్లూరు నగరంలో జరిగిన జర్మనీ అమ్మాయితో ఆంధ్రా అబ్బాయి వివాహ విశేషాలేంటో తెలుసుకుందామా!నెల్లూరు అబ్బాయి, జర్మనీ అమ్మాయి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నెల్లూరు నగరంలోని ఓ కల్యాణ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. నెల్లూరు నగరానికి చెందిన గిరీష్ జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నర్సుగా ఉన్న కథరీనాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరు కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నారు. జర్మనీ నుంచి వచ్చిన అతిధులు సాంప్రదాయ దుస్తుల్లో వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.
Be the first to comment