Heavy Flooding Continues in Srisailam Reservoir due to Rains: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వల్ల శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకి 5,40,756 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 5,15,435 క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 29,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 10 స్పిల్ వే గేట్లను 18 అడుగులు మేర ఎత్తి 4,20,370 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.90 అడుగులకు వరద నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 198.36 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Be the first to comment