Skip to playerSkip to main content
  • 2 weeks ago
Heavy flooding in Vamsadhara River: శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. నది పరవళ్లు తొక్కుతూ వరద నీరు గ్రామాల సమీపంలోకి వచ్చింది. అలానే జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గంలోని పలు మండలాల్లో మహేంద్ర తనయ, నదుల్లో వరద నీటి ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. మహేంద్ర తనయ ఉద్ధృతితో పాతపట్నం కాజ్వే పైనుంచి వరద అధికంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిపివేశారు. కె.గోపాలపురం గ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేక ప్రజలు ఒడిశా పర్లాకిమిడి మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వంశధార ఉద్ధృతితో కొత్తూరు మండలం మాతల, కుంటిభద్రలో వరదకు వీధులు జలమయం అయ్యాయి. పంట పొలాలు వరదలో నానుతున్నాయి. పాతపాడునూ వంశధార వరద ముంచెత్తింది. ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఆమదాలవలస మండలం చెవ్వకులపేట, ఆనందపురంలో అధికారులు పర్యటించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. సరుబుజ్జిలి మండలంలో పెద్దమాల పేట, అగ్రహారం, ఎరగాం, పాతపాడు, తెలికిపెంట, చిన్న కాకితాపల్లి, పెద్ద సబలాపురంలో వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు ముంపుకు గురయ్యాయని రైతులు వాపోయారు.

Category

🗞
News
Transcript
00:00What
00:30Transcription by CastingWords
01:00CastingWords
01:30CastingWords
02:00CastingWords
02:29CastingWords
02:31CastingWords
Be the first to comment
Add your comment

Recommended