Sarpanch Candidate With Rs.100 Bond Manifesto : పంచాయతీ ఎన్నికల పోరులో అభ్యర్థులు ప్రజలను ఆకట్టుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మెదక్ జిల్లా, హవేలి ఘన్పూర్ మండలంలోని కాప్రాయిపల్లి పంచాయతీకి చెందిన రాజుపల్లి తండా నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుక్కల మౌనిక రూ.100బాండ్ పేపర్‌పై తాము నెరవేర్చే హామీలపై 15 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను సిద్ధం చేసింది. అందులో, గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.2,000, తీజ్ పండుగ జరుపుకునేందుకు గానూ గ్రామానికి రూ.20,000, ముదిరాజ్ బోనాల పండుగకు రూ.8,000 ఇస్తానని ప్రకటించారు. అలాగే, ఊర్లో ఎవరైనా అకాల మరణం చెందితే, వారికి ఆపద్బంధు పథకం పేరుతో అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 కూడా ఆర్థిక సహాయం చేస్తానని అభ్యర్థి హామీ ఇచ్చింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేర్చడానికి తాను కట్టుబడి ఉన్నానాని తెలిపింది. మందు, నగదు వంటి ప్రలోభాలకు గురిచేయకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మ్యానిఫెస్టోతో ప్రజల ముందుకు వచ్చానని ఆమె వివరించింది. ఒక వేళ హామీలు నెరవేర్చక పోతే జిల్లా కలెక్టర్‌తో గానీ, న్యాయస్థానం ద్వారా గానీ తనను పదవీ నుంచి తొలగించవచ్చని హామీ ఇచ్చింది. ప్రస్తుతం మౌనిక చేస్తున్న ఈ విన్నూత్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Be the first to comment