Telangana Rising Drone Visuals : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సదస్సు జరుగుతున్న ఫ్యూచర్‌సిటీకి సంబంధించిన డ్రోన్ విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లు, భారీ స్క్రీన్లు, త్రీడీ యానిమేటెడ్ చిత్రాలు, భారీ ఎల్ఈడీ లైట్లు, డిజిటల్ హంగులతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. అక్కడ ఏర్పాట్లపై విజువల్స్ సమ్మిట్ ఆడంబరాన్ని తెలియజేస్తున్నాయి. సదస్సు ప్రాంతంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. సోమవారం సమ్మిట్‌ను ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ నాయకులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సమావేశం రెండో రోజు ఘనంగా కొనసాగుతోంది. మొదటిరోజు జరిగిన సమావేశంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దేశ విదేశాల నుంచి దాదాపు 3వేల మంది ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో దేశ జీడీపీలో 10శాతం వాటా అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో తెలిపారు.
Be the first to comment