Boat Races On The Occasion Of Visakha Utsav : "విశాఖ ఉత్సవ్ - 2026"లో భాగంగా విశాఖ నగరంలోని భీమిలి సాగర తీరంలో అధికారులు పడవల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను రెండు వేర్వేరు ప్రాంతాల్లో రెండు విభాగాలుగా నిర్వహించారు. పర్యాటక, మత్స్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో భీమిలిలో ఈ పోటీలు జరిగాయి. భీమిలి మంగమారి పేట సాగర తీరంలో మోటరైజ్డ్ బోటు రేసు పోటీలను నిర్వహించగా, భీమిలి సాగర సంగమం గోస్తనీ తీర ప్రాంతంలో భీమిలి జోనల్ కార్యాలయం దగ్గరలో నాన్-మోటరైజ్డ్ బోటు రేసు తెప్పల పోటీలు నిర్వహించారు. ఈ పడవ పోటీలకు మొత్తం 30 మంది పరకు పోటీదారులు పాల్గొనగా వీరిలో విజేతలకు, నిర్వాహకులు ప్రత్యేక బహుమతులను కూడా ప్రధానం చేశారు. ఈ పోటీలను భీమిలిలో నిర్వహించడం తమకెంతో ఆనందంగా ఉందని మత్స్యకార నాయకులు గంటా నూకరాజు తెలిపారు. ఈ ప్రాంతంలో నిర్వహించిన పడవ పోటీలలో పాల్గొనడం తమకు మంచి అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందని పోటీలలో పాల్గొన్న ఔత్సాహికులు పేర్కొన్నారు.
Comments