Skip to playerSkip to main content
  • 4 days ago
Navaratri Celebrations with Currency Note Decoration: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని కలెక్టరేట్‌ రోడ్డులో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు అద్భుత దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రూ.4,41,99,999 విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించడం విశేషం. నూతన కరెన్సీతో తీర్చిదిద్దిన ఈ అలంకరణను దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమలాపురం మాత్రమే కాకుండా సమీప గ్రామాల్లోనూ శరన్నవరాత్రి ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గోదాసివారిపాలెంలో రూ.30 లక్షలతో, పల్లవారిపాలెంలో రూ.7 లక్షల నూతన కరెన్సీ నోట్లతో అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. భక్తులు దుర్గమ్మకు పూజలు, భజనలతో భక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిప్పులగుండం కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీమాల ధరించిన భక్తులు పాల్గొని, మాతకు తమ భక్తిని తెలియజేశారు. అమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

Category

🗞
News
Transcript
00:00To be continued...
Be the first to comment
Add your comment

Recommended