F2F With NTR District Collector Lakshmisha About : మొంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు, వీఎంసీ కమిషనర్ ధ్యాన్‌చంద్ర ఇతర శాఖల అధికారులు ఇందులో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 189 తుపాను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. తుపాను దృష్ట్యా జిల్లాలో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా సహాయ చర్యలకు కమాండ్ కంట్రోల్ కేంద్రాల్లో ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌ను సంప్రదించేందుకు 91549 70454 కు ఫోన్ చేయవచ్చు. విజయవాడ ఆర్డీవో కార్యాలయంకు 0866 2574454 కి డయల్ చేయాలి. నందిగామ ఆర్డీవో కార్యాలయంను సంప్రదించేందుకు 78930 53534 కి ఫోన్ చేయాలి. తిరువూరు ఆర్డీవో కార్యాలయంకు 83098 36215, 0867 3251235 ఈ నంబర్లుకు సంప్రదించాలంటున్న కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ ముఖాముఖి.
Be the first to comment