Rs. 2 Crores Worth Diamond Jewellery Gift To Durgamma : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు రెండు కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో కూడిన బంగారు ఆభరణాలు కానుకగా ఇచ్చారు. కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకుడు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి అమ్మవారికి 531 గ్రాముల విశేష వజ్రాభరణాలు సమర్పించారు. బంగారంతో సూర్యుడు, చంద్రుడు, ముక్కుపుడక, బులాకీ, బొట్టు, సూత్రాలు, గొలుసులను చేయించి ఆలయ ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ సతీమణి లక్ష్మి రవి, మాజీ ఎంపీలు గోకరాజు గంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్ శాంతకుమార్ పాల్గొన్నారు. దాతలకు అమ్మవారి దర్శనం కల్పించి పండితులు వేదాశీర్వచనం చేశారు.విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్షల తేదీలను ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్లు గురువారం ప్రకటించారు. నవంబరు ఒకటో తేదీ ఉదయం 8.45 గంటల నుంచి ఐదో తేదీ వరకు భవానీ మండలదీక్షధారణలు ప్రారంభమవుతాయని తెలిపారు. అర్ధమండల దీక్షలు నవంబరు 21 నుంచి 25 వరకు జరుగుతాయని వివరించారు.
Be the first to comment