Ex Minister Malla Reddy Dance : మల్లారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఏది చేసిన అదో మ్యాజిక్‌నే. దాదాపు 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహం పద్దెనిమిదేళ్ల యువకుడిలా ఉంటుంది. పూలమ్మిన, పాలమ్మిన అంటూ ఆయన చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన జీవితంలో చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగారో చెబుతూ ఎప్పుడు ఏ వేదిక మీద అవకాశం దొరికిన ఈ వ్యాఖ్యలు చెబుతూనే ఉంటారు. అలాగే కాలేజీ ఫంక్షన్లు, సినిమా రిలీజ్ పంక్షన్లలో ఆయన చేసే రచ్చ ఎవరూ మరిచిపోలేరు. హీరోలతో సమానంగా స్టెప్లు వేస్తూ అందరినీ ఉత్సాహపరుస్తూ నిత్యం నవ్వులు పూయిస్తూ ఉంటారు. బీఆర్ఎస్ మీటింగ్‌లలో కూడా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి తన స్టెప్లతో సభా ప్రాంగణాన్ని మూత మోగిస్తారు.
తాజాగా బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తుంకుంట మున్సిపాలిటీ కేంద్రంలో గులాబీ జెండాను మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవిష్కరించారు. శామీర్‌పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా నుంచి చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ సభకు బయలుదేరుతున్న వాహనాలకు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ కాన్వాయ్‌గా వరంగల్ సభకు ఆయన బయలుదేరారు. పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి కారు పై కప్పు ఎక్కి మల్లారెడ్డి తనదైన స్టైల్లో స్టెప్లు వేశారు. దీంతో ఆయనతో పాటు వేరే కార్లలలో ఉన్న శ్రేణులు కూడా ఉల్లాసంగా గడిపారు. మధ్యలో బీఆర్ఎస్ శ్రేణులు మల్లారెడ్డి కారును ఆపి ఆయనతో మాట్లాడారు. అనంతరం వారంతా కలిసి వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ సభకు వెళుతున్నారు.
Be the first to comment