Constable Jayashanti met Minister Anitha in Vijayawada: ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్‌ను చక్కదిద్దడం స్ఫూర్తిదాయకంగా నిలిచిన కానిస్టేబుల్ జయశాంతిని హోంమంత్రి అనిత అభినందించారు. జయశాంతి కుటుంబం విజయవాడలోని హోం మంత్రి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. జయశాంతికి హోంమంత్రి 2 రోజుల క్రితం ఫోన్ చేసి అభినందించగా కలవాలని కానిస్టేబుల్ జయశాంతి కోరారు. ఈ రోజు కలిసేందుకు సమయం ఇవ్వగా జయశాంతి కుటుంబ సమేతంగా హోం మంత్రి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అనిత కానిస్టేబుల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి టిఫిన్ చేశారు. కానిస్టేబుల్ కుటుంబం యొక్క యోగక్షేమలను అడిగి తెలుసుకున్నారు. జయశాంతి కుమారుడితో సరదాగా ముచ్చటించారు. జయశాంతి, వారి కుటుంబసభ్యులను కలవడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
Comments