MLC Pochampally Srinivas Reddy : ఫాంహౌస్‌లో కోడిపందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఆయనను వివిధ అంశాలపై విచారించారు. ఫిబ్రవరి 11న తొలకట్ట గ్రామ పరిధిలోని శ్రీనివాస్‌రెడ్డి ఫాంహౌస్‌లో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ, మొయినాబాద్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడి పందేలు ఆడుతున్న వారితో పాటు 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Be the first to comment