Sritech Software Services Pre-Sankranti Celebrations : సంక్రాంతి వచ్చేస్తోంది. రాష్ట్రంలోని ముందస్తు పండుగ సంబరాలు మొదలయ్యాయి. హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ సంస్థలు ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాయి. ఇలాగే మధురానగర్లోని శ్రీటెక్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉద్యోగులు, వారి పిల్లల కోసం నిర్వహించిన రంగోలి పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగాయి. ఉద్యోగులంతా ముగ్గులు వేసి ఆటపాటలతో సందడి చేశారు. సాంస్కృతిక, వినోద కార్యక్రమాలతో ఈ వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, ముచ్చట గొలిపేలా ముగ్గుల అలంకరణలో విద్యార్థినులు, ఉద్యోగులు పోటీ పడ్డారు. అనంతరం భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ఈ సంక్రాంతి వేడుకల సందర్భంగా టెక్నాలజీస్ విత్ ట్రెడిషన్ అనే ఆలోచనతో ఐటీ రంగంలో పరిచయం చేసినట్లు సంస్థ సీఈఓ నరేశ్ బుడవతి తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహిళలకు అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను ప్రోత్సహించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు.
Be the first to comment