Skip to playerSkip to main content
  • 2 hours ago
Robo Wishing CM Revanth Reddy : తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్ థీమ్​తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న​ సమావేశానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు, ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరయ్యారు. దీనికి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లను చేసింది. ఈ సమిట్​లో రోబో సందడి చేసింది. ప్రాంగణంలో సంచరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డితో పాటు ప్రముఖ నాయకులను ఆహ్వానిస్తూ, షేక్​హ్యాండ్​ ఇచ్చింది. ప్రముఖులు రోబో ఆహ్వానిస్తున్న తీరును ఆసక్తిగా తిలకించారు. ఈ రోబో పేరును ఎక్స్​ మ్యాన్​గా పెట్టారు. కాగా, సమావేశాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్​ వర్మ ప్రారంభించారు. 2047కల్లా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. పెట్టుబడులే ధ్యేయంగా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలను నుంచి పెట్టుబడులను ఆకర్షించనుంది. అన్ని రంగాల్లో వృద్ధి సాధించి, రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ప్రగతి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ప్రకటించి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమిట్​ను దావోస్ తరహాలోనే ఉండబోతుందని ఇప్పటికే సీఎం తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.
Be the first to comment
Add your comment

Recommended