Cyclone Montha Fire Department DG Venkataramana Interview : మెుంథా తుపాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక శాఖ అన్ని విధాలుగా సన్నద్ధమైందని ఆ శాఖ డీజీ వెంకట రమణ స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత పరిస్థితులను విజయవాడ అగ్నిమాపక శాఖ ప్రధాన కేంద్రంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పలు జిల్లాల్లో మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోందని అన్నారు. తుపాను ప్రభావం కారణంగా కొన్ని జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ ఈదురుగాలులతో చెట్లు కూలిపోతున్నాయి. విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎక్కడైనా స్తంభాలు పడినట్లు సమాచారం వస్తే, 5 నుంచి 15 నిమిషాల్లో తొలగిస్తున్నాం అని డీజీ అన్నారు. మెుంథా ప్రభావిత ప్రాంతాల్లో 350 మందితో ప్రత్యేక సిబ్బందిని మోహరించామని ఆయన వెల్లడించారు. మెుంథా తుపాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్న అగ్నిమాపక డీజీ వెంకటరమణతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి.
Be the first to comment